'ఆర్ఆర్ఆర్' అభిమానుల‌కు శుభ‌వార్త‌.. గ్లింప్స్‌కు టైమ్ ఫిక్స్

RRR Movie first Glimpse on November 1st.సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2021 8:31 AM GMT
ఆర్ఆర్ఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. గ్లింప్స్‌కు టైమ్ ఫిక్స్

సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)' సినిమా ఒక‌టి. ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించ‌నుండంతో ఈ చిత్రంపై అభిమానుల్లో బారీ అంచ‌నాలే ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7, 2022న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 10 బాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

తాజాగా చిత్ర‌బృందం ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది. నవంబర్ 1 న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లపై డిజైన్ చేసిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను వదిలింది. కాగా.. ఈ గ్లింప్స్‌ 45 సెకండ్ల నిడివి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆలియా భట్, అజయ్ దేవగణ్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, శ్రియ శరణ్, సముద్ర ఖని త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Next Story
Share it