ఆర్ఆర్ఆర్ మ‌రో స‌ర్‌ప్రైజ్‌.. ఈ పాట‌ను ఆఖ‌ర్లో చూపించాల‌ని అనుకున్నాం.. అయితే

RRR Movie another surprise with celebrations anthem song.సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2022 7:17 PM IST
ఆర్ఆర్ఆర్ మ‌రో స‌ర్‌ప్రైజ్‌.. ఈ పాట‌ను ఆఖ‌ర్లో చూపించాల‌ని అనుకున్నాం.. అయితే

సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)' ఒక‌టి. ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుద‌ల కావాల్సి ఉండాల్సి.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు అన్ని అవాంత‌రాలు దాటుకుని మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌లు, ట్రైల‌ర్ లు సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి.

ఇప్ప‌టికే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టింది చిత్ర‌బృందం. ఈ క్ర‌మంలో ఓ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, ఆలియాతో కూడిన కొత్త పోస్ట‌ర్ ని సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. 'ఎత్త‌ర జెండా అనే పాట‌ను సినిమా చివ‌ర్లో చూపించి స‌ర్‌ప్రైజ్ చేయాల‌ని బావించాం. అయితే.. మా సంతోషాన్ని త్వ‌ర‌గా మీతో పంచుకోవాల‌ని అనుకుంటున్నాం. అందకనే ఆర్ఆర్ఆర్ కథాంశం స్ఫూర్తిని చాటే ఈ పాట‌ను మార్చి 14న విడుద‌ల 'చేయ‌నున్న‌ట్లు తెలిపింది.

Next Story