సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు హఠాన్మరణం

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో విలన్‌ రోల్‌

By అంజి  Published on  23 May 2023 7:33 AM IST
RRR movie , Ray Stevenson, Hollywood

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఆర్‌ఆర్‌ఆర్‌ నటుడు హఠాన్మరణం

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో విలన్‌ రోల్‌ పోషించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్‌ సన్‌ హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని ఆయన పీఆర్‌ టీమ్‌ తెలిపింది. అయితే స్టీవెన్‌ సన్‌ అకాల మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. స్టీవెన్‌ సన్‌ ఇక లేరన్న విషయం తెలిసి సీని ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యింది. స్టీవెన్‌ సన్‌కు సినీ ప్రముఖులు నివాళులు ఆర్పిస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలో గవర్నర్‌ స్కాట్‌ బక్స్‌టన్‌ రోల్‌లో స్టీవెన్‌ సన్‌ ఎంతగానో మెప్పించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ సైతం త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేసింది.

‘మీరు చ‌నిపోయార‌నే వార్త మ‌మ్మ‌ల్ని షాక్‌కి గురిచేసింది. మీరెప్ప‌టికీ మా హృద‌యాల్లో నిలిచే ఉంటారు. మీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నాం’ అని ఆర్‌ఆర్‌ఆర్‌ టీం విచారాన్ని వ్యక్తం చేసింది. స్టీవెన్‌ సన్‌ 1964 మే 25న జన్మించారు. 'థోర్‌' సిరీస్‌లతో స్టీవెన్‌ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1990లలో టీవీ షోలతో తన కెరీర్‌ను ప్రారంభించిన స్టీవెన్‌.. 2000 సంవత్సరం హాలీవుడ్‌ మూవీస్‌లో ఛాన్స్‌లు వచ్చాయి. 1998లో 'థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌' మూవీలో మొదటి సారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గ్రీన్‌ విచ్‌ టైమ్‌ ఇన్‌ 1999, అడ్వెంచర్ మూవీ ‘కింగ్ ఆర్థర్’, పనిషర్‌ వార్‌ జోన్‌, బుక్‌ ఆఫ్‌ ఎలీ, ది అదర్‌ గాయ్స్‌, జో రిటాలియేషన్‌, డివర్జెంట్‌, మెమొరీ వంటి సినిమాలతో ఎంతో ఫేమస్‌ అయ్యారు. స్టీవెన్ సన్ అకాల మరణంపై ఆయ‌న అభిమానులు, స‌న్నిహితులు విచారాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story