ఎన్టీఆర్ గాయంపై స్పందించిన 'ఆర్ఆర్ఆర్' చిత్ర‌బృందం

RRR film crew responding to NTR injury.ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2021 10:53 AM IST
ఎన్టీఆర్ గాయంపై స్పందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. రెండు పాట‌లు మిన‌హా మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. పైన‌ల్ షెడ్యుల్ కోసం ఇటీవ‌లే చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్లింది. ఈ నెల చివ‌రి క‌ల్లా షూటింగ్ మొత్తం పూర్తి కానున్న‌ట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుద‌ల చేసి అంచ‌నాలు భారీగా పెంచిన ఆర్ఆర్ఆర్ టీం తాజాగా షూటింగ్ గ్యాప్‌లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, రాజమౌళి ఎలా చిల్ అవుతున్నారో ఓ వీడియో ద్వారా చూపించారు. ఈ వీడియోలో రామ్‌చరణ్‌, తారక్‌లు పిట్టగోడ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. ఆ దృశ్యాలను రాజమౌళి ఓ డమ్మీ కెమెరాతో చిత్రీకరించారు. అయితే.. ఎన్టీఆర్ క‌నుబొమ్మ‌పై గాయం అయిన‌ట్లు క‌నిపిస్తుంది.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త కంగారు ప‌డ్డారు. త‌మ అభిమాన హీరోకి ఏమైంది అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపించారు. దీనిపై ఆర్ఆర్ఆర్ టీం స్పందించింది. అది గాయం కాద‌ని.. మేక‌ప్ అని క్లారిటీ ఇవ్వ‌డంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Next Story