'ఆర్ఆర్ఆర్'కు త‌గ్గ‌ని క్రేజ్‌.. 98 సెక‌న్లు 932 టికెట్లు

RRR 98 seconds 932 Tickets Sold out.ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 2:01 PM IST
ఆర్ఆర్ఆర్కు త‌గ్గ‌ని క్రేజ్‌.. 98 సెక‌న్లు 932 టికెట్లు

ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం). యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు హీరోలుగా న‌టించిన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. మ‌న దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుద‌లై ప‌ది నెల‌లు కావొస్తున్నా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భార‌తీయ చిత్రానికి రానంత క్రేజ్ ఈ చిత్రానికి వ‌చ్చింది. ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్సుల్లో సైతం త‌న హ‌వా చూపిస్తోంది.

ఇదిలా ఉంటే..లాస్ ఏంజిల్స్‌లోని బిగ్గెస్ట్ ఐమాక్స్‌ స్క్రీన్ అయినటువంటి టిసిఎల్‌లో జ‌న‌వ‌రి 9న ఈ చిత్రం స్క్రీనింగ్ కానుంది. ఎన్టీఆర్‌, రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, కీర‌వాణిలు స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నున్న ఈ స్క్రీనింగ్ కోసం ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి ఉంచ‌గా కేవ‌లం 98 సెక‌న్ల‌లోనే మొత్తం టికెట్లు(932) సోల్ట్ అవుట్ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ సినిమాకి ఇలా జ‌ర‌గ‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా బియాండ్ ఫెస్ట్ వాళ్లు తెలియ‌జేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఓ భార‌తీయ సినిమాకి ఈ రేంజ్‌ బుక్సింగ్ రాలేదు. ఇదే తొలిసారి. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ వంటి సినిమా రాలేదు గ‌నుక‌. సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Next Story