రొమాంటిక్ ట్రైల‌ర్‌.. అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది

Romantic Trailer Released.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన చిత్రం రొమాంటిక్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Oct 2021 4:23 PM IST
రొమాంటిక్ ట్రైల‌ర్‌.. అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన చిత్రం 'రొమాంటిక్‌'. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా కూడా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విడుద‌ల ఆల‌స్య‌మైంది. ఎట్ట‌కేల‌కు అన్ని అవాంత‌రాలు దాటుకుని ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ చిత్రం పై ఉన్న అంచ‌నాల‌ను ట్రైల‌ర్ రెట్టింపు చేసింది. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమాలో పుల్ రొమాన్స్ ఉంటుందని అర్థ‌మ‌వుతోంది.

ఈ చిత్రంలో ఆకాశ్ పూరి స‌ర‌స‌న కేతికా శ‌ర్మ న‌టిస్తోంది. అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని పూరీ క‌నెక్ట్స్ ప‌తాకంపై పూరీ జ‌గ‌న్నాథ్‌, చార్మి నిర్మిస్తుండ‌గా.. సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

పూరి జగన్నాద్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరి హీరోగా మొదటి సినిమాతో నిరాశ పర్చినా రొమాంటిక్ తో మాత్రం మొదటి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకునేలా ఉంది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా సినిమా బజ్ అమాంతం పెరిగింది.

Next Story