ఆయుధమైనా.. అమ్మాయైనా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది
Romantic poster from Acharya movie.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ
By తోట వంశీ కుమార్ Published on 13 April 2021 12:25 PM ISTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోండగా.. రామ్ చరణ్ పక్కన పూజాహెగ్డే నటిస్తోంది. ఉగాది పర్వదినం సందర్భంగా.. సిద్ద, నీలాంబరిల లవ్ స్టోరీని విడుదల చేశారు. 'ఆయుధమైనా... అమ్మాయి అయినా... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. ఆచార్య ఉగాది శుభాకాంక్షలు' అంటూ చిరంజీవి ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆయుధమైనా ...అమ్మాయి అయినా ... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021
"షడ్రుచుల సమ్మేళనం మా 'సిద్ధ, నీలాంబరి'ల ప్రేమ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు" అంటూ కొరటాల శివ పేర్కొన్నారు. ట్విట్టర్ లో ఆయన కూడా ఈ పోస్టర్‌ను షేర్ చేశారు.
షడ్రుచుల సమ్మేళనం మా 'సిద్ధ,నీలాంబరి'ల ప్రేమ
— koratala siva (@sivakoratala) April 13, 2021
అందరికి ఉగాది శుభాకాంక్షలు #Acharya #Siddha
Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/IceCGo7N7J
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'లాహే లాహే' అనే సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఇక మెగా స్టార్, మెగా పవర్ స్టార్.. ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం ఉండడంతో ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.