రోర్ ఆఫ్‌ 'ఆర్ఆర్ఆర్‌'.. మేకింగ్ మామూలుగా లేదు.. అదుర్స్ అంతే..

Roar of RRR making video Out.సినీ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2021 5:36 AM GMT
రోర్ ఆఫ్‌ ఆర్ఆర్ఆర్‌.. మేకింగ్ మామూలుగా లేదు.. అదుర్స్ అంతే..

సినీ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులు న‌టిస్తుండ‌గా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీమ్‌, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్ విడుద‌ల కాగా.. సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింతంగా పెంచేశాయి.

పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈచిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. కాగా.. నేటి(గురువారం) ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌గా.. చెప్పిన‌ట్లుగానే విడుద‌ల చేసింది. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ప్ర‌ధానంగా చూపించారు. ఈ వీడియో చూస్తుంటే.. రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం ఖాయం.ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్ వ‌చ్చినా కూడా అనుకున్న స‌మ‌యానికే చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.ఇక ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13, 2021న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌బృందం వెల్ల‌డించింది.




Next Story