'ఆర్ఆర్ఆర్' నుంచి క్రేజీ అప్‌డేట్‌.. గ‌ర్జ‌న‌కు సిద్దం కండి

Roar of RRR making video on July 15th.సినీ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 12:42 PM IST
ఆర్ఆర్ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. గ‌ర్జ‌న‌కు సిద్దం కండి

సినీ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈచిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులు న‌టిస్తుండ‌గా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ కొమురం భీమ్‌, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్ విడుద‌ల కాగా.. సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింతంగా పెంచేశాయి.

పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ చిత్ర ప్రమోషన్లను ప్రారంభించాలని 'ఆర్‌ఆర్‌ఆర్' బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జులై 15 ఉద‌యం 11గం.ల‌కు ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం తెలిపింది. ఇక నుంచి వ‌రుస అప్‌డేట్‌లు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. దర్శకుడు రాజమౌళి జులై చివరి నాటికి ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం షూటింగ్ ను పూర్తి చేసి, నిర్మాణానంతర పనులపై దృష్టి పెట్టబోతున్నారు.

క‌రోనా కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్ వ‌చ్చినా కూడా అనుకున్న స‌మ‌యానికే చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.ఇక ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13, 2021న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌బృందం వెల్ల‌డించింది.

Next Story