కేజీయఫ్-2 'టీజర్'పై ఆర్జీవి పంచ్!
RGV tweets on KGF 2 Teaser.కన్నడ స్టార్ యష్ నటించిన కేజీయఫ్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కి ఎంతటి ఘనవిజయాన్ని
By తోట వంశీ కుమార్
కన్నడ స్టార్ యష్ నటించిన కేజీయఫ్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కి ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే కేజీయఫ్ సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే కేజీయఫ్-2' పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా కేజీయఫ్-2 టీజర్ విడుదల చేశారు. అయితే ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అతి కొద్ది రోజులలోనే కోట్లలో వ్యూస్ రావడం గమనార్హం. అయితే తాజాగా ఈ టీజర్ పై కాంట్రవర్సి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
Until 2 years back let alone BOLLYWOOD even South industry never took KANNADA INDUSTRY seriously ..KUDOS to @prashanth_neel & @TheNameIsYash for putting it on the WORLD MAP #KGF2 🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2021
రెండేళ్ల క్రితం బాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమ కూడా కన్నడ ఇండస్ట్రీని గుర్తించలేకపోయింది. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కన్నడ పరిశ్రమకు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిందని రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
BAHUBALI 2 trailer 11 cr views in 3 YEARS RRR 3.8 cr in 3 MONTHS and KGF 2 14 cr in 3 DAYS.. OUCHH! This is a STOMACH PUNCH delivered by @Prashanth_neel on behalf of all KANNADIGAS into the stomachs of all the other film industries 😬😬😬
— Ram Gopal Varma (@RGVzoomin) January 15, 2021
తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో పోలిస్తే కేజీయఫ్-2 చిత్రం టీజర్ పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో భారీ బడ్జెట్ పెట్టి నిర్మించే చిత్రాల టీజర్ కోట్లల్లో వ్యూస్ సాధించాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటిది కేజీయఫ్-2 టీజర్ విడుదలైన మూడు నాలుగు రోజుల్లోనే 14 కోట్ల వ్యూస్ సాధించడం గమనార్హం. ఈ చిత్రం ద్వారా మిగిలిన అన్ని చిత్ర పరిశ్రమలకు ప్రశాంత్ నీల్ గట్టి దెబ్బ కొట్టాడని రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం కేజీయఫ్-2 ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.అయితే త్వరలోనే ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.