జూబ్లీహిల్స్ ఘ‌ట‌న‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు.. ఒక్క ప్ర‌శ్న త‌రువాత అంతా సైలెంట్‌

RGV tweets on BJP MLA Raghunandan Rao over Jubilee Hills Case.జూబ్లీహిల్స్ అత్యాచార‌ ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2022 4:55 AM GMT
జూబ్లీహిల్స్ ఘ‌ట‌న‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు.. ఒక్క ప్ర‌శ్న త‌రువాత అంతా సైలెంట్‌

జూబ్లీహిల్స్ అత్యాచార‌ ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఇందులో రాజ‌కీయ నేతల‌ ప్ర‌మేయం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఈ కేసు కీల‌కంగా మారింది. ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌రో వైపు సంచ‌ల‌న విష‌యాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్ప‌టికే త‌న‌దైన శైలిలో స్పందించారు.

జూబ్లీహిల్స్ ఘ‌ట‌న‌పై బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు మాత్ర‌మే నిజాయితీగా మాట్లాడుతున్నార‌ని, మిగ‌తా వారంతా త‌ప్పుదోవ ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రించ‌డం బాధ‌క‌రం అని నిన్న ట్వీట్ చేసిన వ‌ర్మ నేడు వ‌రుస ట్వీట్లు చేశాడు.

ర‌ఘునంద‌న్‌రావు పై సెక్ష‌న్ 228a కింద కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న వారంతా ఒక్క ప్ర‌శ్న త‌రువాత సైలెంట్ అయిపోయార‌న్నాడు. దిశ కేసు నిందితులైన మైన‌ర్ల‌ను మీడియాలో ప‌దే ప‌దే చూపించి, ఆమె కుటుంబ స‌భ్యుల‌తో ప‌లు ఇంట‌ర్వ్యూలు తీసుకున్న‌ప్ప‌డు ఎవ‌రిపైనా ఎందుకు కేసు న‌మోదు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

ఒక వేళ ర‌ఘునంద‌న్‌రావు గొంతు ఎత్త‌క‌పోయి ఉంటే జూబ్లీహిల్స్ అత్యాచార ఘ‌ట‌న ఎక్క‌డకు చేరి ఉండేదో ఆ దేవుడికే తెలియాలి. ఆ పేద బాలిక‌కు న్యాయం జ‌రిగేలా వ్య‌వ‌స్థ‌లో క‌ద‌లిక తెచ్చినందుకు ఒక స‌మాజంగా మ‌నం అత‌డికి రుణ ప‌డి ఉండాలి.

ఇది భ‌యాన‌కంగా క‌నిపిస్తోంది. వారు ప్ర‌ధాన నిందితుడిగా ర‌ఘునంద‌న్‌రావు ను చూస్తున్న‌ట్లు అనిపిస్తోంద‌ని, అస‌లు కేసును సెకండ‌రీగా చూస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని వ‌ర్మ ట్వీట్ చేశాడు.



Next Story