వర్మను కిడ్నాప్ చేసిందెవరు..?

RGV Missing Tralier.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న సినిమాల‌తో క‌న్నా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Nov 2021 9:59 AM GMT
వర్మను కిడ్నాప్ చేసిందెవరు..?

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న సినిమాల‌తో క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నానుతుంటారు. ప్రస్తుతం కొండా సురేఖ దంపతుల పై ఓ సినిమా రూపొందిస్తున్నారు. అయితే.. అప్పుడెప్పుడో 'ఆర్జీవీ మిస్సింగ్‌' అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చిన వర్మ.. ఇప్పుడు ఆ సినిమాకు ప్రమోషన్స్‌ మొదలు పెట్టాడు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాడు.

ట్రైల‌ర్‌లోకి వెళితే.. వర్మ లాక్ డౌన్ లో తీసిన 'పవర్ స్టార్' సినిమాకు ఆర్జీవీ మిస్సింగ్ కాన్సెప్ట్ ని జత చేసి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఒక్క సీటు కూడా రాలేదా' అని బాధ పడుతున్న ఓ పొలిటికల్ లీడర్ ని చూపించడంతో టీజర్ ప్రారంభమైంది. కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్ గా భావించి పోలీసులు మిస్సింగ్ కేసుని లైట్ తీసుకుంటారు. కానీ ఆ తర్వాత అదే నిజమని తెలుస్తుంది. వర్మ కిడ్నాప్ వెనుక ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ , మెగా ఫ్యామిలీ లేదా మాజీ ముఖ్యమంత్రి లేదా అత‌డి కుమారుడు అనుమానితులని చెబుతున్నారు. అయితే ఆర్జీవీ మిస్సింగ్ కేసుని ఛేదించడానికి సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గజినీకాంత్ రంగంలోకి దించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ సినిమా కథ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి? అనేది తెలియాలంటే చిత్రం విడుద‌ల‌ అయ్యే వరకు ఆగాల్సిందే.

Next Story
Share it