RGV దెయ్యం ట్రైలర్.. చూస్తే భయం పుట్టాల్సిందే

RGV Deyyam trailer release.తాజాగా.. ఇప్పుడు 'ఆర్జీవి దెయ్యం' సినిమా పేరుతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2021 6:20 PM IST
Deyyam trailer

ఒక‌ప్పుడు హార్ర‌ర్ సినిమాకు కేరాఫ్ అడ్ర‌స్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌. 'కౌన్‌', 'భూత్‌,' 'ఫూంక్ 'వంటి చిత్రాల‌తో భ‌య‌పెట్టాడు. అయితే.. కొంత‌కాలంగా ఆయ‌న నుంచి అటువంటి చిత్రాల‌ను రావ‌డం లేదు. వివాదాల‌తో ఎక్కువ‌గా సావాసం చేస్తున్నాడు. తాజాగా.. ఇప్పుడు 'ఆర్జీవి దెయ్యం' సినిమా పేరుతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ను విడుద‌ల చేశారు. రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. స్వాతి దీక్షిత్, తనికెళ్ళభరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే దెయ్యం పట్టిన అమ్మాయి గా స్వాతి దీక్షిత్ అదరగొట్టింది. ఆమె తండ్రి పాత్రలో రాజశేఖర్ కూడా వితౌట్ మేకప్ నటించారు. ట్రైల‌ర్ చూస్తుంటే ప్ర‌తి స‌న్నివేశం ఉత్కంఠ‌ను పెంచుతోంంది. 'దెయ్యం ప‌ట్టిందంటే.. జ‌త క‌ట్టిందంతే.. అంతే' అంటూ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఏప్రిల్ 16న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చూడాలీ మ‌రి.. ఈ చిత్రంతోనైనా వ‌ర్మ పాత మాజిక్‌ను చూపెడుతాడో లేదో మ‌రీ..




Next Story