రిప‌బ్లిక్ టీజ‌ర్

Republic teaser out.మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం రిప‌బ్లిక్ టీజ‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2021 11:52 AM IST
Republic teaser out

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం రిప‌బ్లిక్‌. దేవ క‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై నిర్మాత‌లు జై.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావులు నిర్మిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. తేజ్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ సోమ‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న‌, డైలాగ్‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్ర లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కి ఎం. సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story