ఓటీటీలో విడుద‌ల‌కు సిద్ద‌మైన సాయిధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్‌.. ఎప్పుడంటే..?

Republic Movie releasing on November 26th in OTT.సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం రిపబ్లిక్‌. దేవ క‌ట్టా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2021 7:52 AM GMT
ఓటీటీలో విడుద‌ల‌కు సిద్ద‌మైన సాయిధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్‌.. ఎప్పుడంటే..?

సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం 'రిపబ్లిక్‌'. దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 1 విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ్ ఐఏఎస్‌ అధికారిగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టించింది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. జీ 5 ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను భారీ మొత్తానికి ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 26న ఈ చిత్రం జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందంతో పాటు జీ5 సంయుక్తంగా ప్ర‌క‌టించాయి.

థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు అల‌రిస్తుందో చూడాలీ. అయితే.. చాలా చిత్రాలు థియేట‌ర్ల‌లో ఆక‌ట్టుకోలేక‌పోయినా.. ఓటీటీలో స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. రిప‌బ్లిక్ చిత్రంలో చివ‌ర్లో హీరో చ‌నిపోవ‌డాన్ని చాలా మంది జీర్ణించుకోలేక‌పోయారు.

ఇదిలా ఉంటే.. వినాయక చవితి రోజున(సెప్టెంబ‌ర్ 10న‌) హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. నెల‌రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన అనంత‌రం సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌లే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న పూర్తిగా కోలుకుంటున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి సాయి కొత్త సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story
Share it