రిపబ్లిక్ ట్రైలర్ వ‌చ్చేసింది

Republc Trailer Out.మెగా హీరో సాయిధరమ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’. దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2021 5:15 AM GMT
రిపబ్లిక్ ట్రైలర్ వ‌చ్చేసింది

మెగా హీరో సాయిధరమ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం 'రిపబ్లిక్'. దేవ‌క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్ర‌లో తేజు స‌ర‌స‌న ఐశ్వర్య రాజేశ్ న‌టిస్తోంది. అక్టోబ‌ర్ 1న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే నిర్మాత‌లు వెల్ల‌డించారు. అయితే.. హీరో తేజు రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌డంతో ఈ చిత్రాన్ని విడుద‌ల‌ను వాయిదా వేయ‌నున్నారు అనే వార్త‌లు వినిపించాయి. అవ‌న్నీ పుకార్ల‌నేన‌ని తేలిపోయాయి. అక్టోబ‌ర్ 1వ తేదీనే ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష అని ట్వీట్ చేశారు మెగా స్టార్ చిరంజీవి.

ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. సీరియస్ పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని జేబీ ఎంటరటైన్మెంట్స్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి

Next Story