కరోనా కష్టకాలంలో తన వంతు సాయం చేస్తోంది నటి రేణూ దేశాయ్. కరోనా రోగులకు ఆర్థికంగా సాయం చేస్తూ వస్తున్నారు. అయితే.. కొందరు దానిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది గుర్తించిన రేణు దేశాయ్.. ఇక మీదట ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు, నిత్యావసరాలు మాత్రమే అందిస్తానని పేర్కొంది. తాను మంచి చేయబోతే.. తనకు చెడు ఎదురైంది అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మంచి మనసుతో సాయం చేద్దామని సంకల్పించినవారికి తోడుగా నిలబడతారో లేదో కానీ వారు చేసే పనిని మాత్రం ప్రశ్నించేందుకు, అందులో తప్పులు వెతికేందుకు రెడీగా ఉంటారని అంటోంది.
ఆర్థిక సాయం చేయండంటూ తనకు మెసెజ్‌లు వస్తున్నాయని.. తాను అసలు ఆర్థిక సాయం చేయలేనని, ఫుడ్, మెడిసిన్స్ వరకు సాయం చేయగలనని చెప్పుకొచ్చారు. అలా కాకుండా ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఒకవేళ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కొందరు అంటుంటే, మరి కొందరు చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారట. ఈ విషయంపై సీరియస్ అయిన రేణూ దేశాయ్ ఇలాంటి మెసేజ్‌లు చేస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రేణూ దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.