పవన్ కళ్యాణ్‌కు షాక్.. కరోనా బారిన పడిన రేణు దేశాయ్, అకీరా
Renu Desai and Akira Nandan test positive for COVID-19.దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసుల
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2022 12:59 PM ISTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడా లేకుండా ఎవ్వరినీ ఈ మహమ్మారి వదలడం లేదు. ఇక సినిపరిశ్రమలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మీ, సూపర్ స్టార్ మహేష్‌బాబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, త్రిష సహా పలువురు ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడగా.. తాజాగా నటి, దర్శకురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, కొడుకు అకీరాలకు కరోనా సోకింది.
ఈ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'హలో.. కరోనా సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ.. న్యూ ఇయర్ వేడుక సమయంలోనూ ఇంట్లోనే కూర్చున్నప్పటికీ నాలోను, అకీరాలోను కరోనా లక్షణాలు కనపడ్డాయి.. పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఇద్దరం కరోనా నుంచి కోలుకుంటున్నాం. మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే.. ప్రతి ఒక్కరు థర్డ్ వేవ్ ను సీరియస్‌గా తీసుకోండి. మాస్క్ ధరిస్తూ వీలైనంత జాగ్రత్తగా ఉండండి. నేను గత ఏడాది వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఇప్పుడు అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దామని అనుకునే సమయంలో అతడికి కరోనా సోకిందని ' అంటూ రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.
ఇక ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు, రేణు దేశాయ్ అభిమానులు వారు కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.