ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మకు మాతృవియోగం

Renowned music director Mani Sharma lost his mother. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి మరువకముందే.. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు

By అంజి
Published on : 11 Sept 2022 6:05 PM IST

ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మకు మాతృవియోగం

రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి మరువకముందే.. సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మణిశర్మకు మాతృవియోగం జరిగింది. మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి (88) ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా సరస్వతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మణిశర్మకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

మచిలీపట్నంలో జన్మించిన మణిశర్మ ఆ తర్వాత అనేకమంది సంగీత దర్శకుల దగ్గర కంపోజర్‌గా పనిచేశారు. అశ్వినీ దత్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా రూపొందిన 'చూడాలని ఉంది' సినిమాతో ఆయన సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. గత కొన్నేళ్లుగా సైలెన్స్‌గా ఉన్న మణిశర్మ.. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో యాక్టివ్‌ అవుతున్నారు. పలు పెద్ద ప్రాజెక్టులకు కూడా ఇప్పుడు మ్యూజిక్‌ అందిస్తున్నారు.

Next Story