సినిమా టికెట్ ధరలు.. పాత విధానాన్నే పాటించాలన్న సుప్రీం కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

By -  Medi Samrat
Published on : 13 March 2026 4:24 PM IST

సినిమా టికెట్ ధరలు.. పాత విధానాన్నే పాటించాలన్న సుప్రీం కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. టికెట్ ధరల పెంపు విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే, సదరు చిత్రం విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాల విడుదలకు, వాటి బడ్జెట్ రికవరీకి ఇబ్బందులు తలెత్తుతాయని చిత్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ 90 రోజుల నిబంధనను సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్‌ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న పాత విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది.

Next Story