రియాలిటీ స్టార్ ఆత్మహత్య

Reality Star Kailia Posey commits suicide.ఐదేళ్ల వ‌య‌స్సులోనే అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్ 'టాడ్లర్స్ అండ్ టియారస్'లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2022 4:26 AM GMT
రియాలిటీ స్టార్ ఆత్మహత్య

ఐదేళ్ల వ‌య‌స్సులోనే అమెరికన్ రియాలిటీ టీవీ సిరీస్ 'టాడ్లర్స్ అండ్ టియారస్'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కైలియా పోసీ. కాగా.. ఈ టీనేజ్ స్టార్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. కెనడా సరిహద్దుకు కొద్ది మైళ్ల దూరంలో వాషింగ్టన్‌ స్టేట్‌ బిర్చ్‌ బే స్టేట్‌ పార్క్‌ వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించిన‌ట్లు తెలిపారు. ఆమె వ‌య‌స్సు కేవ‌లం 16 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. 'ఇంటర్నెట్‌ గ్రిన్నింగ్‌ గర్ల్‌'గా ఆమె జిఫ్‌ ఫైల్ ఇప్ప‌టికీ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.

కుమారై మరణం గురించి తెలియచేయడానికి తాను చింతిస్తున్నానని తల్లి మెర్సీ పోసీ గట్టర్‌మాన్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపింది. 'ఈ బాధను పంచుకోవడానికి తన వద్ద ఎటువంటి పదాలు, ఆలోచనలు లేవన్నారు. అందమైన చిన్నారి వెళ్లిపోయిందని.. ఇప్పుడు ఆమె గురించి మననం చేసుకునేందుకు దయచేసి మాకు ప్రేవసీ కల్పించండని' వేడుకున్నారు. ఆమె ఎన్ని జన్మలకైనా తన బేబీనే అని పోస్ట్ చేసింది.

ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. బంగారు భవిష్యత్తు ఉన్న టీనేజర్ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటం అనుచితం అన్పిస్తోందని, ఇది తప్పుడు నిర్ణయం అని టిఎంజడ్ తెలిపింది.

ఎంతో ప్ర‌తిభ క‌లిగిన కైలియా పోసీ చిన్న‌త‌నం నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకుంది. స్టార్‌ టాడ్‌లర్స్‌ షో టీఎల్‌సీ ఛానెల్‌లో 2009 నుంచి 2013 మధ్య ప్ర‌సారమైంది. ఇందులో అందాల పోటీలకు తమ పిల్లలను ప్రిపేర్‌ చేసే కుటుంబాలను చూపిస్తూ వచ్చారు. అందులో ఒక తారే ఈ కైలియా పోసీ. ఆపై ఆమె ఎన్నో టీవీ సిరీస్‌లు, రియాలిటీ షోలలోనూ కనిపించింది.

Next Story
Share it