ఆకట్టుకుంటున్న రామ్‌చరణ్ - శంకర్ మూవీ ఫస్ట్ పోస్టర్
RC 15 Ramcharan first poster out.మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం
By తోట వంశీ కుమార్ Published on
8 Sep 2021 7:13 AM GMT

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్ర పూజా కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశంలో భాగంగా చిరంజీవి.. రామ్‌చరణ్‌పై క్లాప్ కొట్టారు. చరణ్ కెరీర్‌లో 15, దిల్ రాజు నిర్మాణ సంస్థకి 50వ చిత్రంగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అడ్వాణీ, ఇతర ముఖ్య పాత్రల్లో అంజలి, రవిబాబు, సునీల్, జయరామ్ నటించబోతున్నారు. ఈచిత్రానికి థమన్ సంగీతాన్ని అందించనున్నారు.
అంతకముందు ఈ మూవీ ఫస్ట్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు.
Next Story