రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' విడుద‌ల తేదీ ఖ‌రారు

మాస్ మ‌హారాజా రవితేజ న‌టిస్తున్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్ర విడుద‌ల తేదీని ఖ‌రారు చేసింది చిత్ర‌బృందం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2023 4:11 PM IST
Raviteja, Tiger Nageswara Rao Release Date

రవితేజ' టైగర్ నాగేశ్వరరావు' విడుద‌ల తేదీ ఖ‌రారు

'ధ‌మాకా' చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. వంద కోట్లు కొల్లగొట్టి ఈ చిత్రం పడిపోతున్న ర‌వితేజ మార్కెట్‌ను పుంజుకునేలా చేసింది. ఈ చిత్రం ఇచ్చిన జోష్‌తో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ పుల్ బిజీగా అయ్యారు ర‌వితేజ‌. సినిమాల షూటింగ్‌ల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నారు.

'రామ‌ణాసుర' చిత్రం విడుద‌ల‌కు సిద్దం అవ్వ‌గా, తాజాగా మ‌రో చిత్ర విడుద‌ల తేదీని చెప్పేశారు. ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ అధారంగా తెర‌క‌క్కెతున్న "టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు" సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా..ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్‌లు గానీ, మేజర్‌ అప్‌డేట్‌లు గానీ రాకుండానే ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండ‌గా, జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. రేణుదేశాయ్‌ కీలకపాత్రలో నటిస్తోంది

Next Story