కంటైనర్ బాక్సుల మధ్యలో రవితేజ.. వైరల్
Raviteja Khiladi first glimpse. రవితేజ తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఖిలాడి'.
By తోట వంశీ కుమార్ Published on 26 Jan 2021 11:17 AM ISTసంక్రాంతికి 'క్రాక్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఖిలాడి'. ప్లే స్మార్ట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గ్లింప్స్‌ను విడుదల చేసింది. కంటైనర్ బాక్సుల మధ్యలో రవితేజ స్టైలీష్‌గా ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాప్ అనిపిస్తుంది. మేకర్స్ ఈ చిన్న గ్లిమ్స్ తోనే సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం నలుగురు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మరియు అన్బు-అరివు పనిచేస్తున్నారు.
'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 'లూసిఫర్' సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల మధ్యకు రానుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.