ఈడీ విచారణకు హాజరైన రవితేజ
Raviteja Attends for ED Investigation.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిధుల మళ్లింపు సంబంధించి 12 మంది సీనీ
By తోట వంశీ కుమార్ Published on
9 Sep 2021 5:25 AM GMT

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నిధుల మళ్లింపు సంబంధించి 12 మంది సీనీ ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మి, నందు, రానా లను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హీరో రవితేజకు కూడా నోటిసులు జారీ చేయగా.. నేడు ఈడీ విచారణకు ఆయన హాజరయ్యారు. ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి గురువారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు.
గతంలోనూ వీరు ఎక్సైజ్ విచారణను ఎదుర్కొన్నారు. కెల్విన్ నుంచి రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌కు డ్రగ్స్ సరఫరా అయినట్లు ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌క్లబ్‌తో ఉన్న పరిచయాలు, విదేశీ టూర్లు, కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది. కాగా.. నందు, రానాలను డ్రగ్ అప్రూవర్ కెల్విన్ సమక్షంలో ఈడీ విచారించింది. దీంతో నేడు మరోసారి కెల్విన్ హాజరు అయ్యే అవకాశం కనిపిస్తుంది.
Next Story