నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు.. దీనికి కూడా పనికిరామా..?
RaviBabu comments on MAA elections.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 6 Oct 2021 2:41 PM ISTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మంచు విష్ణు సభ్యులపై తీవ్ర విమర్శలు చేయగా.. మంచు విష్ణు కూడా స్ట్రాంగ్ గా రిప్లేనే ఇచ్చారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పరిస్థితులు వేడెక్కుడున్నాయి. తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడిగా తెలుగు వారినే ఎన్నుకోవాలని సూచించారు. తెలుగు నటుల కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థే మా అని.. అలాంటి సంస్థను నడిపేందుకు మనలో ఒకరైనా పనికిరారా అని ప్రశ్నించారు.
ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇది లోకల్, నాన్ లోకల్ గురించి కాదు. నేను ఈ ప్యానల్ కు ఓట్లు వేయండి, ఆ ప్యానల్ కు ఓట్లు వేయండి అని చెప్పట్లేదు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు మన సినిమాలు తీసే వారు మన క్యారెక్టర్ ఆర్టిస్టులను వదిలేసి బయట క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి, వారి డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకుంటారు. మన ఫిల్మ్ మేకర్స్ ఇతర భాషల నుండి హీరోయిన్స్, నటులను తీసుకొస్తారు. మన తెలుగు నటీనటులు తమ సినిమాలలో ఆ ప్రత్యేక పాత్రకు తగినవారు కాదేమో. వారి వల్ల డబ్బింగ్ రైట్స్ ద్వారా డబ్బులు వస్తాయేమో. అందుకే ఇది దర్శకులు మరియు నిర్మాతల ఎంపిక కావచ్చు. ఎందుకంటే వారు తమ సొంత డబ్బును పెట్టారు. కాబట్టి ఇందులో తప్పు ఏమీ లేదు. ఆ బయట నుంచి వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టుల అదృష్టం. మన క్యారెక్టర్ ఆర్టిస్టుల దురదృష్టం.దరాబాద్‌లో 200 మంది కెమెరామెన్లకు పని లేదు. ఔట్‌డోర్ బిల్లులు చూసి నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. ముంబై నుంచే మేకప్‌మెన్లు, హెయిర్ డ్రెసర్లు వస్తున్నారు. తెలుగు నటులను పట్టించుకోవాలని రవిబాబు సూచించారు.