రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్
Ravi Teja's 'Ramarao on Duty' to release on June 17.మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.
By తోట వంశీ కుమార్ Published on 23 March 2022 5:58 AM GMT
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన దివ్యాంశా కౌశిక్, రజిషా విజయన్ నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీకి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.
#RamaRaoOnDuty from 17th June 😎 pic.twitter.com/vRMB9xjQYB
— Ravi Teja On Duty (@RaviTeja_offl) March 23, 2022
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర బృందం ఫిక్స్ చేసింది. జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కొన్ని భారీ వాహనాలు అడవి గుండా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. కాగా.. ఇటీవల ఖిలాడీతో థియేటర్‌లోకి వచ్చిన మాస్ మహారాజా అంచనాలను అందుకోలేకపోయాడు. మరీ ఈ చిత్రంతో రవితేజ సక్సెస్ బాట పడుతాడో లేదో చూడాలి.