మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. పోటీ పడుతోంది ఎవరితోనంటే?

ఆగస్టు 15.. మంచి రిలీజ్ డేట్ అని అందరూ భావిస్తున్నారు. పలు క్రేజీ సినిమాలు ఈ డేట్ కు విడుదల అవుతున్నాయి.

By Medi Samrat  Published on  21 July 2024 1:24 PM GMT
మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. పోటీ పడుతోంది ఎవరితోనంటే?

ఆగస్టు 15.. మంచి రిలీజ్ డేట్ అని అందరూ భావిస్తున్నారు. పలు క్రేజీ సినిమాలు ఈ డేట్ కు విడుదల అవుతున్నాయి. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ శంకర్ రేసులో ఉండగా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ బరిలోకి దిగాడు. మిస్టర్ బచ్చన్ మాస్ మహారాజా రవితేజ, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ల కాంబో. ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై TG విశ్వ ప్రసాద్ నిర్మించిన మిస్టర్ బచ్చన్‌లో జగపతి బాబు విలన్‌గా నటించారు.

ఆగస్టు 15, 2024న డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా విడుదల కాబోతోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలవగా.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేయాలని చూస్తున్నారు. ఇన్ని రోజులూ సింగిల్ రిలీజ్ ఉంటుందని భావించినా.. ఇప్పుడు క్రేజీ మూవీస్ ఆగస్టు 15 వీకెండ్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తూ ఉన్నాయి. నివేతా థామస్ 35-చిన్న కథ కాదు, విక్రమ్ తంగలాన్ (తెలుగు డబ్), నార్నే నితిన్ 'ఆయ్' సినిమా కూడా అదే రోజున విడుదలవుతున్నాయి.

Next Story