మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస హిట్స్‌తో పుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రావణాసుర’ చిత్రం ఒకటి. నేడు(జనవరి 26న) రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో పెద్దగా డీటెయిల్స్ రివీల్ చేయలేదు. అయితే.. చూపించిన విజువల్స్ మాత్రం మంచి హిట్టింగ్ గా ఉన్నాయి.
చివరల్లో సినిమా టైటిల్‌కు తగ్గట్లుగా పగిలిన గ్లాస్ ముక్కల్లో రవితేజ ముఖాన్ని చూపించడం ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ తో సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశారు. యూనిక్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ లు కథానాయికలుగా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 7 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ భారీ ధరకు సొంతం చేసుకుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ 5 వద్ద ఉండగా, శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది.