రామారావు ఆన్ డ్యూటీ టీజర్‌.. 'పేరు సింపుల్‌గా ఉన్నా.. వాడు సూపర్ మ్యాన్'

Ravi Teja Rama Rao On Duty Movie Teaser out.మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్‌ మందవ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 4:55 PM IST
రామారావు ఆన్ డ్యూటీ టీజర్‌.. పేరు సింపుల్‌గా  ఉన్నా.. వాడు సూపర్ మ్యాన్

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్‌ మందవ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్‌, ర‌జిషా విజ‌య‌న్ న‌టిస్తున్నారు. మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 'పేరు, రూపం సింపుల్‌గా ఉన్న వాడు సూప‌ర్ మ్యాన్' అంటూ ర‌వితేజ గురించి చెప్పే డైలాగ్‌ తో టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. 'ఆయుధం మీద ఆధార‌ప‌డే నీలాంటి వాడి ధైర్యం వాడి ఆయుధంలో ఉంటుంది. ఆయుధంలా బ‌తికే నాలాంటి వాడి ధైర్యం అణువ‌ణువునా ఉంటుంది' అంటూ మాస్‌మ‌హారాజా చెప్పే డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story