ర‌వితేజ 'ఖిలాడి' రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Ravi Teja Khiladi movie release on February 11th 2022.ఈ ఏడాది క్రాక్ చిత్రం ఘ‌న విజ‌యంతో మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌రుస

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2021 5:33 AM GMT
ర‌వితేజ ఖిలాడి రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ఈ ఏడాది 'క్రాక్' చిత్రం ఘ‌న విజ‌యంతో మాస్ మ‌హారాజా ర‌వితేజ వ‌రుస చిత్రాల‌ను లైన్‌లో పెట్టాడు. ఇందులో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న 'ఖిలాడి' చిత్రం ఒక‌టి. ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా విడుద‌ల ఆల‌స్య‌మైంది. సత్యనారాయణ కోనేరు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈచిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఫిబ్రవరి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సాతో పాటు దేవిశ్రీ తమ్ముడు సాగర్ మాటలు రాస్తున్నాడు. ఇక ఫిబ్రవరి 4న మెగాస్టార్ 'ఆచార్య' విడుదల కానుండగా.. వారం రోజుల గ్యాప్ తో 'ఖిలాడి' రానున్నాడు. ఇక అడ‌వి శేషు న‌టిస్తున్న మేజ‌ర్ చిత్రం కూడా ఫిబ్ర‌వ‌రి 11నే రానుంది.

Next Story