'రావ‌ణాసుర' ఫ‌స్ట్ లుక్‌.. అదిరిపోయింది అంతే

Ravanasura movie First look release.క్రాక్ చిత్రం ఘ‌న విజ‌యంతో మాస్ మ‌హారాజా ర‌వితేజ పుల్ జోష్‌లో ఉన్నాడు. వ‌రుస‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2021 5:47 AM GMT
రావ‌ణాసుర ఫ‌స్ట్ లుక్‌.. అదిరిపోయింది అంతే

'క్రాక్' చిత్రం ఘ‌న విజ‌యంతో మాస్ మ‌హారాజా ర‌వితేజ పుల్ జోష్‌లో ఉన్నాడు. వ‌రుస‌గా చిత్రాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. క‌రోనా కార‌ణంగా.. ఓ ప‌క్క మిగ‌తా హీరోలు ఆచితూచి అడుగులు వేస్తుంటే.. ర‌వితేజ మాత్రం వ‌రుస చిత్రాల‌ను ప్ర‌క‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. రమేశ్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖిలాడి', శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ', నక్కిన త్రినాథరావు ద‌ర్శ‌క‌త్వంలో 'ధమాకా' సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా.. రవితేజ తన 70వ చిత్రాన్ని కూడా ఇటీవలే ప్రకటించారు.ఈ చిత్రానికి సుదీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రానికి 'రావ‌ణాసుర' అనే టైటిల్‌ను ఫిక్స్ చేయ‌గా.. 'హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్ ' అనే ట్యాగ్ లైన్ ఆస‌క్తిక‌రంగా ఉంది.

తాజాగా నేడు ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. భూతాలు అందరికీ దేవుడు అంటూ రవితేజ ని "రావణాసుర" గా పరిచయం చేశారు. రావణుడి మాదిరిగా పది తలలతో ర‌వితేజ ఈ పోస్ట‌ర్ లో క‌నిపిస్తున్నాడు. ఓ భారీ కపాలం పై సూటుబూట్ వేసుకుని ఓ సుత్తిలాంటిది ప‌ట్టుకుని ఉండ‌గా.. దానికి ర‌క్తం ఉంది. న్యాయస్థానానికి సంబంధించిన గ్రంథాలు, వస్తువులు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి పోస్ట‌ర్ ఓ రేంజ్‌లో ఉంది. పోస్ట‌ర్ చూస్తుంటే సినిమా చాలా డిఫ‌రెంట్‌గా తెర‌కెక్క‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, రవితేజాలు తమ బ్యానర్స్ లో నిర్మిస్తున్నారు.

Next Story
Share it