ఆ పాత్రలో నటిస్తానంటున్న రష్మిక

Rashmika social media trending. ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా... ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తీరిక

By అంజి  Published on  13 Oct 2021 1:19 PM GMT
ఆ పాత్రలో నటిస్తానంటున్న రష్మిక

ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా... ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ తీరిక సమయం లేకుండా గడుపుతోంది. కన్నడ బ్యూటీ అయిన రష్మిక.. వరుస హిట్స్ కొట్టేస్తూ చిత్ర దర్శక నిర్మాతలకు వన్‌ అండ్ ఓన్లీ ఛాన్స్ అవుతోంది. నేషనల్ క్రష్ అయిన ఈ భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్నా విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా సినిమా పుష్పలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని రష్మిక ఆత్రుతతో చూస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక.. సినిమాలతో పాటు ఇతర అప్‌డేట్స్‌ను తన అభిమానులకు ఎప్పటికప్పుడూ అందిస్తూ ఉంటుంది.

క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాట్లాడేటప్పుడు నాయిస్ చేసే ఈ భామకు చాలా మందే అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని తనను బెంగాలీ వస్త్రధారణలో డిజైన్‌ చేసిన పోస్టర్‌ను రష్మిక మందన్నా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లోని స్టోరీలో షేర్‌ చేసింది. ఇప్పుడు నేను బెంగాలీ రోల్‌లో నటించాలని కోరుకుంటున్నానని, ఇది అద్బుతంగా ఉందని, ధన్యవాదాలు అంటూ పోస్టు చేసింది. ప్రస్తుతం రష్మిక మందన్నా బెంగాల్ గెటప్‌ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. త్వరలో రష్మిక మిషన్‌ మజ్ను సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా మెయిన్‌ రోల్ చేస్తున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్‌బై సినిమాలో, తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్ళు సినిమాలో రష్మిక నటిస్తోంది.

Next Story