ర‌ష్మిక‌కు షాక్‌.. వాళ్ల వ్యాపారం కోసం ఏకంగా గుండు కొట్టేశారు..!

Rashmika shaved head photos viral.ప్ర‌స్తుతం గుండుతో ఉన్న ర‌ష్మిక ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2021 7:50 AM GMT
Rashmika shaved head

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్ల‌లో ర‌ష్మిక మందాన్న ఒక‌రు. అందం, అభిన‌యం ఆమె సొంతం. ఆమె న‌టించిన సినిమాలు దాదాపుగా బ్లాక్ బాస్ట‌ర్‌లుగా నిలుస్తుండ‌డంతో అమ్మ‌డు ప్ర‌స్తుతం టాప్ రేంజ్‌లో దూసుకుపోతోంది. తెలుగులోనే కాకుండా, త‌మిళం, క‌న్న‌డంలోనూ ర‌ష్మిక విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. దీంతో ఆమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అయితే.. ప్ర‌స్తుతం గుండుతో ఉన్న ర‌ష్మిక ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఏంటీ ర‌ష్మిక నిజంగానే గుండు కొట్టించుకుందా..? అని ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. నిజం తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. అస‌లు విష‌యం తెలిసింది. త‌మిళ‌నాడులోని కొంద‌రు సెలూన్ షాపు వాళ్లు.. త‌మ వ్యాపారం కోసం ఆమె గుండుతో ఉన్న ఫోటోల‌ను ఉప‌యోగించుకుంటున్నారు. సాధారణంగా సెలూన్ల కోసం హీరోల ఫోటోలను ఉపయోగించుకోవడం ఎక్కువగా జరుగుతుంది. అలా కాకుండా తమిళనాడులో హీరోయిన్స్ ఫోటోలను గుండు కొట్టి మరీ వాళ్ళ ప్రచారానికి వాడుకుంటారు. ఈ ఫోటోల‌ను ఎవ‌రో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అవి వైర‌ల్‌గా మారాయి. రష్మిక గుండు ఫోటోలతో ఫన్నీ మీమ్స్‌ సృష్టిస్తూ మీమర్స్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలు చూసి ఈ కన్నడ భామ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలీ మ‌రీ.


Next Story
Share it