రణబీర్ కపూర్ 'యానిమల్‌'లో హీరోయిన్‌గా రష్మిక..?

Rashmika Mandanna to replace Parineeti Chopra in Ranbir Kapoor's 'Animal'. రణబీర్ కపూర్ రాబోయే చిత్రం 'యానిమల్' గురించి ప్రేక్షకులలో చాలా ఉత్సుకత ఉంది.

By Medi Samrat
Published on : 29 March 2022 4:32 PM IST

రణబీర్ కపూర్ యానిమల్‌లో హీరోయిన్‌గా రష్మిక..?

రణబీర్ కపూర్ రాబోయే చిత్రం 'యానిమల్' గురించి ప్రేక్షకులలో చాలా ఉత్సుకత ఉంది. ఎందుకంటే రణబీర్.. కబీర్ సింగ్ మూవీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి ప‌నిచేయ‌డ‌మే. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా న‌టిస్తుంద‌ని స‌మాచారం. అయితే.. ఈ అమ్మ‌డు ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీ ఉండి.. డేట్స్ స‌ర్దుబాటు చేయ‌లేక పోవ‌డం వల్ల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించ‌నుంద‌నే టాక్ విన‌బ‌డుతుంది.

రణబీర్ సరసన న‌టించ‌డానికి రష్మిక ఓకే చెప్పిన‌ట్లు బీ టౌన్‌లో విన‌బడుతుంది. నిర్మాత భూషణ్ కుమార్, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు రష్మిక సరిపోతుందని భావించారు. యానిమల్ ద్వారా రణబీర్ కపూర్, రష్మిక ఇద్దరూ తొలిసారి తెరపైకి సంద‌డి చేయ‌నున్నార‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్స్‌లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. పరిణీతి చోప్రా ప్ర‌స్తుతం ఇంతియాజ్ అలీ సినిమా చమ్కిలాలో న‌టిస్తుంది. చమ్కిలా సినిమా డేట్స్ కార‌ణంగా యానిమల్ కు డేట్లు స‌ర్ద‌లేక ప్రాజెక్టును వీడిన‌ట్లు తెలుస్తోంది.










Next Story