కన్నడ బ్యూటీకి ఆఫర్ల వెల్లువ.. మరో క్రేజీ ప్రాజెక్టులో రష్మిక మందన్న..!
Rashmika Mandanna got another Crazy project.ఛలో చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మికా మందన్న.
By తోట వంశీ కుమార్ Published on
15 March 2022 5:25 AM GMT

'ఛలో' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మికా మందన్న. అందం, నటనతో చాలా తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో పుల్ బిజీగా ఉంది. అందులో ఐకాన్ స్టార్ బన్ని హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప 2' చిత్రం ఒకటి. ఇదిలా ఉంటే.. తాజాగా అమ్మడి వద్దకు మరో క్రేజీ ప్రాజెక్టు వచ్చిందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ కెరీర్‌లో 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ మీద శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరో రామ్ తప్ప ఎవరెవరు నటిస్తున్నారు అన్న సంగతి తెలీదు. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా రష్మిక ను నటింపజేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోందట. ఇప్పటికే వారు రష్మిక వద్దకు వెళ్లి కథ వినిపించగా.. ఆమె కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి కనబరిచిందని అంటున్నారు. దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
Next Story