ఆకట్టుకుంటున్న 'రష్మీ రాకెట్' ట్రైలర్.. అథ్లెట్‌గా అదరగొట్టిన తాప్సీ

Rashmi Rocket movie trailer released.ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2021 6:56 AM GMT
ఆకట్టుకుంటున్న రష్మీ రాకెట్ ట్రైలర్.. అథ్లెట్‌గా అదరగొట్టిన తాప్సీ

'ఝుమ్మంది నాదం' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్పి. తెలుగులో వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ.. బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంది. కెరీర్ ఆరంభంలో గ్లామ‌ర్ పాత్ర‌లు చేసిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ప్ర‌స్తుతం తాప్సీ న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం 'ర‌ష్మీ రాకెట్‌'. ఆకర్ష్ ఖురానా ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. గ్రామీణ స్థాయి నుంచి వెళ్లి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం అవమానాలు ఎదుర్కొన్న కొంత మంది అథ్లెట్ల జీవితాలని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు.

తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఓమ‌హిళా అథ్లెట్ తన లక్ష్యం చేరడం కోసం ఎలాంటి అవాంతరాల్ని ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. అథ్లెట్‌గా తాప్సీ అద‌ర‌గొట్టింది. సమాజం ముందు దోషిగా నిలబడిన రష్మీ.. హ్యుమన్ రైట్స్‌ని ఆశ్రయించి ఎలాంటి పోరాటాన్ని చేసింది. తిరిగి తన కలని ఎలా నిజం చేసుకుంది అనేది ఈ చిత్రంలో చూపించ‌బోతున్నార‌నేది.. ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం అక్టోబ‌ర్ 15న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Next Story