గోవిందా కాళ్ల మీద పడ్డ రణవీర్ సింగ్
Ranveer Singh breaks down after meeting his God Govinda.బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో గోవిందా అంటే ఎంతో మందికి
By M.S.R Published on 2 Jan 2022 1:32 PM IST
బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో గోవిందా అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా 90వ దశకంలో భారీ హిట్స్ ను అందుకుని గోవిందా ఎవరికీ అందనంత స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన్ను చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కు కూడా గోవిందా అంటే ఎంతో అభిమానం. తాజాగా ఓ షోలో రణవీర్ సింగ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
రణవీర్ సింగ్ తన గేమ్ షో, ది బిగ్ పిక్చర్‌లో తన ఆరాధ్య దైవం గోవిందాని హోస్ట్ చేస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఓ వీడియోలో రణ్‌వీర్ గోవిందను కలుసుకున్నప్పుడు ఏడుస్తున్నట్లు కనిపించగా.. గోవిందా రణవీర్ సింగ్ ను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. గోవిందా ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ రణ్‌వీర్ తన 'దేవుడు' అని పిలిచాడు. "ఈ శుభ దినాన, నా దేవుడే మమ్మల్ని కలవడానికి వస్తున్నాడు. వన్ అండ్ ఓన్లీ, హీరో నంబర్ వన్, గోవిందా," అని రణ్‌వీర్ చెప్పుకొచ్చాడు.
మరో క్లిప్‌లో రణవీర్ గోవిందా పాదాల వద్ద పడుకుని, గట్టిగా పట్టుకున్నట్లు చూపించారు. ఇద్దరూ కలిసి ఇష్క్ హై సుహానా, యుపి వాలా తుమ్కా మరిన్ని పాటలకు డ్యాన్స్ చేశారు.ఈ షోలో గోవింద కుటుంబం భార్య సునీత, కూతురు టీనా మరియు కుమారుడు యశ్వర్దన్ అహుజా కూడా వీడియో కాల్స్ ద్వారా మాట్లాడారు. రణవీర్ తరచుగా గోవిందా పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరుస్తూ, ఆయన్ను 'లెజెండ్' అని అభివర్ణించాడు. 2014లో వారిద్దరూ కలిసి నటించిన 'కిల్ దిల్' ఫ్లాప్ గా నిలిచింది. రణ్వీర్ చివరిగా కబీర్ ఖాన్ తీసిన '83' సినిమాలో కనిపించాడు.