గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025 ముగింపు వేడుకలో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 లోని ఒక కీలకమైన సన్నివేశాన్ని అనుకరించడంపై విమర్శలు చెలరేగడంతో నటుడు రణ్‌వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. రణవీర్ సింగ్ చేసిన పనిని ఎంతో మంది తీవ్రంగా తప్పుబట్టారు. దైవాలను 'దయ్యాలు'గా ప్రస్తావించడంపై మరో వివాదం నెలకొంది.
రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ప్రకటన పోస్ట్ చేశారు. "సినిమాలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడమే నా ఉద్దేశ్యం." అని ఆయన పోస్టులో తెలిపారు. సాంస్కృతిక వైవిధ్యం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఇలా చేసానని అన్నారు. "మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను. ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను." అని తెలిపాడు రణవీర్ సింగ్.