'రంజితమే' తెలుగు వెర్షన్‌ వచ్చేస్తుంది

Ranjitame telugu version from varisu releasing tomorrow.ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న చిత్రం 'వారిసు'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Nov 2022 12:17 PM IST
రంజితమే తెలుగు వెర్షన్‌ వచ్చేస్తుంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న చిత్రం 'వారిసు'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. తెలుగులో 'వార‌సుడు' పేరుతో రానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2023 జ‌న‌వ‌రి రెండో వారంలో ఈ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది.

అందులో భాగంగా న‌వంబ‌ర్ మొద‌టి వారంలో ఈ చిత్రం నుంచి 'రంజిత‌మే' పాట‌ను విడుద‌ల చేశారు. త‌మ‌న్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్ప‌టి వ‌ర‌కు 70 మిలియ‌న్ల వ్యూస్‌ను రాబ‌ట్టింది. త‌మిళ వెర్ష‌న్ పాట‌ను విడుద‌ల చేసి చాలా రోజులు అయితున్న‌ప్ప‌టికి ఇంకా తెలుగు వెర్ష‌న్ పాట‌ను ఎప్పుడు విడుద‌ల చేస్తారా..? అని అభిమానులు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అభిమానుల‌కు చిత్ర‌బృందం శుభ‌వార్త చెప్పింది. తెలుగు వెర్ష‌న్ రంజిత‌మే పాట‌ను న‌వంబ‌ర్ 30న ఉద‌యం 9.09 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం తెలియ‌జేసింది.

Next Story