ర‌ష్మీ గౌత‌మ్‌పై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rani Gari Bangla producer sensational comments on Rashmi Gautam.ర‌ష్మీ గౌత‌మ్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌సరం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 March 2022 9:50 AM GMT
ర‌ష్మీ గౌత‌మ్‌పై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ర‌ష్మీ గౌత‌మ్‌.. ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌సరం లేదు. బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై కూడా న‌టిస్తూ మెప్పిస్తోంది. సుధీర్‌తో ల‌వ్ ట్రాక్ న‌డిపి మ‌రింత పాపుల‌ర్ అయింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న న‌టించే అవకాశం కొట్టేసింది. వీటిని కాస్త ప‌క్క‌న పెడితే.. ఓ నిర్మాత ర‌ష్మీ గౌత‌మ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్మీ త‌న‌ను బెదిరించింద‌ని.. ఆ కాల్ రికార్డ్ ఇంకా త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని నిర్మాత నాగ‌లింగం చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ర‌ష్మీతో 'రాణి గారి బంగ్లా' చిత్రాన్ని చేసేట‌ప్పుడు కొంచెం దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. స‌గం సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. ఓ సాంగ్ చేయాల్సి ఉండ‌గా.. తాను న‌టించ‌లేన‌ని మొండికేసింది. హీరోను మార్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. అందుకు తాము ఒప్పుకోకపోవ‌డంతో నాకు నాగ‌బాబు తెలుసు, మ‌ల్లెమాల శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి తెలుసూ అంటూ బెదిరించింది. అయితే.. నేను కూడా చాలా కాలంలో ఇండ‌స్ట్రీలో ఉంటున్న‌.. నాకు కూడా వారిద్ద‌రూ తెలుసున‌ని చెప్పాను. ఇలా షూటింగ్ మ‌ధ్య‌లో ఆపేస్తే లీగ‌ల్ కేసు పెడ‌తాన‌ని, ఫిల్మ్‌న‌గ‌ర్ గేటుకు క‌ట్టేసి కొడ‌తాన‌ని చెప్ప‌డంతో ర‌ష్మీ దిగివ‌చ్చింది.

మిగ‌తా షూటింగ్‌ను పూర్తి చేసింది. అయితే.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే వయసులో తనకన్నా చిన్నదైన రష్మీ.. కనీస గౌరవం లేకుండా మాట్లాడిందట. తాను కూడా అలాగే ఆమెతో మాట్లాడాన‌ని ఇదంతా న్యాయం కోస‌మే అని చెప్పుకొచ్చారు. ఇవ‌న్నీ కాస్త ప‌క్క‌న బెడితే.. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఏ స‌న్నివేశానికి కూడా ర‌ష్మీ ఒక్క ఎక్స్‌ట్రా టేక్ కూడా తీసుకోకుండా న‌టించింద‌ని.. ఆమె మంచి యాక్ట‌ర్ అంటూ చెప్ప‌డం కొస‌మెరువు. మ‌రీ దీనిపై ర‌ష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story
Share it