బిగ్‌బాస్ సీజ‌న్ 5.. కింగ్ ఔట్.. భ‌ళ్లాళ‌దేవా ఇన్‌..!

Rana to host Bigg Boss Telugu season 5.ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్‌బాస్‌కు రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. ఏ భాష‌లోనైనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jun 2021 4:02 PM IST
బిగ్‌బాస్ సీజ‌న్ 5.. కింగ్ ఔట్.. భ‌ళ్లాళ‌దేవా ఇన్‌..!

ప్ర‌పంచ వ్యాప్తంగా బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజే వేరు. ఏ భాష‌లోనైనా అభిమానులు ఈ షోకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక తెలుగులో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ఐదో సీజ‌న్లోకి అడుగుపెడుతోంది. ఇప్ప‌టికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక వంటివి తుది ద‌శ‌కు చేరుకున్నాయి. తాజాగా ఈ షోకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

గ‌త రెండు సీజ‌న్ల‌ను విజ‌యవంతం కావడంతో త‌న వంతు పాత్ర పోషించిన హోస్ట్ నాగార్జున ఐదో సీజ‌న్‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ట‌. ఆయ‌న స్థానంలో టాలీవుడ్ యంగ్ హీరో రానా హోస్ట్ గా కనిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. నాగార్జున ప్ర‌స్తుతం రెండు, మూడు సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో నిర్వాహ‌కులు ఈసారి హోస్ట్‌గా రానా ను ఎంచుకున్నార‌ని.. ఇప్ప‌టికే ఆయ‌న్ను ఈ విష‌య‌మై క‌లువ‌గా.. అందుకు రానా కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రియాలిటీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హరిస్తున్న రానాకు.. బుల్లితెర ప్రేక్ష‌కుల్లోనూ మంచి ఆద‌ర‌ణ ఉంది. దీంతో ఆయ‌న్నే ఫైన‌ల్ చేసార‌నే టాక్ న‌డుస్తోంది.

కంటెస్టెంట్స్ వీరేనా..

తాజా స‌మాచారం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ 5 నుండి ఈ షో ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి సంబంధించి ఇప్ప‌టికే జూమ్ ద్వారా ఇంట‌ర్వ్యూలు చేసిన‌ట్టు తెలుస్తుండ‌గా, వారంద‌రికి వ్యాక్సినేష‌న్ పూర్తైన త‌ర్వాత బ‌యోబ‌బుల్ వాతావ‌ర‌ణంలో ఉంచ‌నున్నార‌ట‌.అనేక జాగ్ర‌త్త‌ల న‌డుమ ఈ షో మొద‌లు కానుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే నంటూ ఓ లిస్ట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, ఆ లిస్టులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Next Story