రేవంత్ నియామకంపై రామ్‌గోపాల్ వ‌ర్మ ట్వీట్‌.. వైర‌ల్‌

RamGopal Varma sensational tweet about Revanth Reddy.తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌విపై గ‌త కొద్ది రోజులుగా పెద్ద

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2021 4:41 AM
రేవంత్ నియామకంపై రామ్‌గోపాల్ వ‌ర్మ ట్వీట్‌.. వైర‌ల్‌

తెలంగాణ పీసీసీ చీఫ్ ప‌ద‌విపై గ‌త కొద్ది రోజులుగా పెద్ద చర్చే న‌డిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక‌పోయిన‌ప్ప‌టికీ చాలా మంది సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అనే తేడా లేకుండా అంద‌రూ పీసీసీ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేశారు. పీసీసీ చీఫ్ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుందోన‌న‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంది. తెలంగాణ పీసీసీ చీఫ్ పై క‌స‌ర‌త్తు ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. కాగా.. దీనిపై కొంత‌మంది నేత‌లు గుర్రుగా ఉన్న‌ప్ప‌టికీ చాలా మంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ పీసీసీగా రేవంత్‌ రెడ్డిని నియమించడంపై ద‌ర్శ‌కుడు రాం గోపాల్‌ వర్మ తనదైన స్టైల్‌ లో స్పందించారు. 'ల‌య‌న్‌.. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించి కాంగ్రెస్ పార్టీ ఎట్ట‌కేల‌కు ఒక సూప‌ర్, ఫెంటాస్టిక్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు పులుల‌న్నీ రేవంత్ రెడ్డి అనే సింహానికి భయపడిపోవాల్సిందే' అని ట్వీట్ పెట్టిన వర్మ.. ఆ వెంటనే మ‌రో ట్వీట్‌ చేస్తూ 'రేవంత్‌ రెడ్డిని అధ్య‌క్షుడిగా ఎన్నుకున్న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీపై మ‌రోసారి ఆస‌క్తి క‌లిగింది. రాహుల్ గాంధీ నువ్వు, మీ అమ్మ ఒక గొప్ప ప‌ని చేశారు' అని వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేశాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ ట్వీట్లు వైర‌ల్‌గా మారాయి.

Next Story