ముగిసిన ర‌మేష్‌బాబు అంత్య‌క్రియ‌లు

Ramesh Babu’s final rites completed.సినీ న‌టుడు, నిర్మాత, సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేశ్‌బాబు సోద‌రుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 8:32 AM GMT
ముగిసిన ర‌మేష్‌బాబు అంత్య‌క్రియ‌లు

సినీ న‌టుడు, నిర్మాత, సూప‌ర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మ‌హేశ్‌బాబు సోద‌రుడు ఘ‌ట్ట‌మ‌నేని ర‌మేష్‌బాబు అంత్య‌క్రియ‌లు పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో రమేష్ బాబు చితికి కుమారుడు జయకృష్ణ నిప్పుపెట్టారు. ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ‌స‌భ్యులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొని తుది వీడ్కోలు ప‌లికారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకున్నారు.

ర‌మేష్‌బాబు గ‌త కొంత‌కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. శ‌నివారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. ఆయ‌న మార్గ‌మ‌ధ్యంలోనే ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఈ రోజు(ఆదివారం) ఉదయం పద్మాలయ స్టూడియోస్‌లో రమేశ్ బాబు భౌతిక కాయాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు రమేశ్ బాబుకి నివాళులు అర్పించారు.

స్టూడియోకి చేరుకున్న కృష్ణ‌, ఆయ‌న స‌తీమ‌ణి ఇందిరాదేవి కుమారుడి పార్థివ‌దేహాన్ని చూసి చ‌లించిపోయారు. క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. మ‌హేష్‌బాబుకు క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌హేష్‌తో పాటు ఆయ‌న కుటుంబం ఐసోలేష‌న్‌లో ఉండ‌డంతో అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకాలేక‌పోయారు.

Next Story
Share it