రెండు భాగాలుగా రామాయణ.. రిలీజ్ ఎప్ప‌డంటే..?

రణబీర్ కపూర్-యష్-సాయి పల్లవి ముఖ్య పాత్రల్లో రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  6 Nov 2024 9:15 PM IST
రెండు భాగాలుగా రామాయణ.. రిలీజ్ ఎప్ప‌డంటే..?

రణబీర్ కపూర్-యష్-సాయి పల్లవి ముఖ్య పాత్రల్లో రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత విడుదల తేదీని ప్రకటించారు. అయితే ఈ సినిమా ఒకే భాగంగా తెరకెక్కించట్లేదు. రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా రెండు భాగాలుగా సినిమా విడుదలవుతుందని ధృవీకరించారు. దీపావళి 2026లో పార్ట్ 1, దీపావళి 2027లో పార్ట్ 2 విడుదల కాబోతోందని తెలిపారు.

రిలీజ్ డేట్స్ కు సంబంధించిన పోస్టర్ లేదా పోస్ట్‌లో చిత్ర తారాగణం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. పోస్టర్‌లో విడుదలయ్యె సంవత్సరాల గురించి, చిత్ర దర్శకుడి పేరు నితేష్ తివారీ అంటూ ప్రస్తావించారు. గతంలో రామాయణం సెట్స్ నుండి అనేక చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఒక చిత్రంలో, రణబీర్ కపూర్, సాయి పల్లవి కనిపించారు. అదే సమయంలో యష్, తాను రావణ్ పాత్ర పోషిస్తున్నట్లు ధృవీకరించారు. ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం.

Next Story