'రామ్‌సేతు' ట్రైలర్‌.. అంచ‌నాల‌ను పెంచేశారు

Ram Setu Official Trailer Released.ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా సినిమాల‌ను చేస్తుంటాడు అక్ష‌య్ కుమార్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Oct 2022 8:38 AM GMT
రామ్‌సేతు ట్రైలర్‌.. అంచ‌నాల‌ను పెంచేశారు

హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా సినిమాల‌ను చేస్తుంటాడు అక్ష‌య్ కుమార్‌. వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో రామ్‌సేతు ఒక‌టి. అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ భారుచ్చా, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

వ‌రుస‌గా చిత్ర అప్‌డేట్‌ల‌ను విడుద‌ల చేస్తూ సినిమాపై ఇప్ప‌టికే క్యూరియాసిటీని పెంచ‌గా.. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. #RamSetu first glimpse ని మీరు ఎంతగానో ఆదరించారు..ఈ దీపావళికి, పదండి వెళ్దాం రామ్ సేతు ప్రపంచం లోకి మన కుటుంబంతో! అని అక్ష‌య్ ట్వీట్ చేశారు.

రామ్‌సేతు బ్రిడ్జి కాపాడ‌డానికి అక్ష‌య్ కుమార్ బృందం చేసే సాహ‌సాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ పురావ‌స్తు శాస్త్ర‌వేత్త ఆర్య‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Next Story