అక్టోబర్ నుంచి రామ్ - పూరి సినిమా ఫిక్స్

Ram - Puri Jagannath movie starts from October. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్

By Sumanth Varma k  Published on  25 April 2023 3:45 PM IST
అక్టోబర్ నుంచి రామ్ - పూరి సినిమా ఫిక్స్

Ram - Puri Jagannath


డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ భారీ విజయాన్ని సాధించింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరికి సరైన హిట్ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ హిట్ ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. అయితే పూరి - రామ్ కలయికలో మరో సినిమా రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది.

ప్రస్తుతం పూరి ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ డ్రామాతో రామ్ తో పూరి మళ్లీ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా రామ్.. డాన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడట. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ రామ్ కి జోడీగా నటించే అవకాశం ఉంది.


Next Story