మాతృదినోత్సవం.. తాను మంచి కొడుకును కాదు అంటూ వ‌ర్మ ట్వీట్‌.. వైర‌ల్‌

Ram Gopal Varma's unusual Mother's Day tweet goes viral.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2022 3:52 PM IST
మాతృదినోత్సవం.. తాను మంచి కొడుకును కాదు అంటూ వ‌ర్మ ట్వీట్‌.. వైర‌ల్‌

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఒకప్పుడు సినిమాల‌తో వార్త‌ల్లో నిలిచిన వ‌ర్మ.. ఇప్పుడు వివాదాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇటీవ‌ల కాలంలో వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రాలు థియేట‌ర్ల‌లో ఎప్పుడు వ‌చ్చి వెలుతున్నాయో కూడా తెలియ‌డం లేదు. సినిమాల విష‌యం కాస్త ప‌క్క‌న పెడితే.. ఏ విష‌యాన్ని అయినా స‌రే సూటిగా, వివాదాస్ప‌దంగా చెప్ప‌డం ఒక్క వ‌ర్మ‌కే సాధ్యం.

ఈ రోజు మ‌ద‌ర్స్ డే(మాతృదినోత్స‌వం) సంద‌ర్భంగా వ‌ర్మ ఓ ట్వీట్ చేశారు. త‌న‌దైన శైలిలో త‌న మాతృమూర్తికి వ‌ర్మ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాయారు. తాను ఓ మంచి కొడుకును కాదంటూ త‌న‌పైనే సెటైర్ వేసుకున్నారు.

'హ్యాపీ మదర్స్ డే మామ్. నేను ఓ మంచి కొడుకును కాదు. కానీ.. ఓ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి' అంటూ చేతిలో గ్లాస్ పట్టుకుని తన తల్లితో కలిసి దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు వ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వ‌ర్మ‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story