ఎన్టీఆర్, అఖిల్‌ను టార్గెట్ చేసిన వర్మ..! ట్వీట్ వైరల్
Ram Gopal Varma shares jr ntr and akhil video.నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ ను టార్గెట్ చేశాడు..
By తోట వంశీ కుమార్ Published on
9 April 2021 6:32 AM GMT

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడు ఎవరినీ టార్గెట్ చేస్తాడో తెలీదు. సినీ ప్రముఖలు, రాజకీయ నాయకులపైన తరచూ తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధిస్తుంటాడు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని అఖిల్ ను టార్గెట్ చేశాడు. ఓ మూవీ ఈ వెంట్‌లో ఎన్టీఆర్, అఖిల్ లు పక్క పక్కన కూర్చుని సరదాగా మాట్లాడుకున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్.. అఖిల్ కాలిపై గిల్లాడు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వర్మ ఇక హీరోయిన్ల భవిష్యత్తు కష్టల్లో పడినట్లే.. అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్ వేశారు.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఇక దీనిపై ఎన్టీఆర్, అక్కినేని అభిమానులు తమదైన శైలి స్పందిస్తున్నారు. రెండు పెగ్గులు పడగానే.. ఏది పడితే అది మాట్లాడుతావు.. నీ గురించి మాకు తెలియదా అంటూ ఆర్జీవీపై మండిపడుతున్నారు ఫ్యాన్స్.
Next Story