ఏపీ సీఎంతో సినీ ప్ర‌ముఖుల భేటీపై వ‌ర్మ సెటైర్లు.. 'సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్' అంటూ

Ram Gopal Varma setires on Chiranjeevi team meeting with CM Jagan.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2022 12:15 PM IST
ఏపీ సీఎంతో సినీ ప్ర‌ముఖుల భేటీపై వ‌ర్మ సెటైర్లు.. సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ అంటూ

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల త‌న సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. నిన్న‌(గురువారం) ఏపీ సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖులు భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి త‌దిత‌ర‌లు పాల్గొన్నారు. స‌మావేశం అనంత‌రం మీడియాతో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇప్పటికి శుభం కార్డు పడిందని, మరో వారం లేదా 10 రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

కాగా.. ఈ స‌మావేశంపై రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించారు. "సూపర్, మెగా, బాహుబలి లెవెల్ బెగ్గింగ్ వల్ల ఈ మీటింగ్ జరిగినప్పటికీ, ఒమేగా స్టార్‌ని వైఎస్ జగన్ ఆశీర్వదించినందుకు నేను సంతోషిస్తున్నాను. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్‌ని నేను అభినందిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

అంతకుముందు వర్మ ఓ ట్వీట్ చేసి డిలీట్ చేశారు. 'ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా హర్ట్ అయ్యా' అంటూ ట్వీట్ చేశారు. కొద్దిసేప‌టికే దానిని డిలీట్ చేశారు. దీంతో నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో వ‌ర్మ‌పై సెటైర్లు వేస్తున్నారు.

Next Story